ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహన దొంగలు అరెస్ట్..20 బైక్​లు స్వాధీనం - Arrest of motorists arrested by cadapa police

కర్ణాటక ప్రాంతంలో బైక్​లను అపహరిస్తూ కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అజిత్ కుమార్, ప్రభుదాసులు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వాహన దొంగలు అరెస్ట్..20 బైక్​లు స్వాధీనం

By

Published : Aug 18, 2019, 9:54 AM IST

వాహన దొంగలు అరెస్ట్..20 బైక్​లు స్వాధీనం

కర్ణాటక ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ కడప జిల్లాలోని నందలూరు, రాజంపేట, పుల్లంపేట ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మైఖేల్, గుణ అనే ఇద్దరు వ్యక్తులు రూ.30 లక్షల విలువ చేసే 20 ద్విచక్రవాహనాలను అపహరించారు. వీటిని పెనగలూరు మండలం తిరుణంపల్లికి చెందిన అజిత్ కుమార్, తూర్పుపల్లికి చెందిన ప్రభుదాసులు రాజంపేట, నందలూరు ప్రాంతాల్లో విక్రయించారు. ఈ కేసులో అజిత్ కుమార్, ప్రభుదాస్​లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు ఇస్తామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details