కడప జిల్లా రాయచోటిలో ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 350 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందర్నీ ప్రత్యేక వాహనాలలో వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రమైన కడపలోని ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలిస్తున్నారు. అక్కడ సరిపడ పడకలు లేవు. సరైన వైద్యం సకాలంలో అందించకపోవడం వంటి సమస్యలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతవాసుల సమస్యను గుర్తించిన అధికారులు స్థానికంగానే కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు.
రాయచోటిలో కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు అధికారుల చర్యలు - covid cases in rayachoti
రాయచోటిలో కరోనా కేసుల అధికమౌతున్నాయి. బాధితులను జిల్లా కేంద్రమైన ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలిస్తున్నారు. వీరికి అక్కడ సరైన వైద్యం సకాలంలో అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు స్థానికంగానే కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
![రాయచోటిలో కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు అధికారుల చర్యలు రాయచోటిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు అధికారుల చర్యలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8318592-942-8318592-1596727732332.jpg)
ఈ మేరకు బుధవారం పట్టణ సమీపంలోని మాసాపేట వద్ద నిర్మించిన వెల్ఫేర్ భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ కేర్ సెంటర్లో సుమారు 200 పడగలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోగులకు అవసరమైన చికిత్స అందించేందుకు ఎల్లప్పుడు వైద్యులు ఇతర సిబ్బంది అక్కడ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రోగికి అత్యవసర చికిత్స నిమిత్తం ఆక్సిజన్ కూడా కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటుందని కొవిడ్-19 నోడల్ అధికారి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నియోజవర్గంలో కరోనా వ్యాప్తి నివారణకు అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కేర్ సెంటర్ అందుబాటులోకి వస్తే కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి