తోటి కానిస్టేబుల్ మరణిస్తే సహోద్యోగులందరూ ముందుకు వచ్చి వారికి తోచినంత సాయం చేసి మానవత్వం చాటుతున్నారు. కడపకు చెందిన ఏపీఎస్పీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సహోద్యోగుల కుటుంబాలను కష్టాల్లో ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. 1998వ బ్యాచ్‌లో ఎంపికైన కానిస్టేబుల్స్ అందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సహాయం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లూకయ్య ఈనెల 14వ తేదీ అనారోగ్యంతో మరణించాడు. సుమారు 15 మంది కానిస్టేబుళ్లు తమకు తోచినంత డబ్బులు పోగు చేసి లక్షా 25 వేల రూపాయల నగదును మృతుడి కుటుంబానికి అందజేశారు.
మానవత్వం చాటుతున్న ఏఆర్ పోలీసులు - ar constable news
పోలీసు ఉద్యోగులు కటువుగా ఉంటారని అనుకుంటారంతా..కానీ కడప ఏఆర్ పోలీసులు దాతృత్వం చాటుతూ వారికీ మనసుందని తెలియజేస్తున్నారు. సహోద్యోగి మరణిస్తే..తోచినంత ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుతున్నారు.
మృతుడి కుటుంబానికి ఆర్ధికసాయం అందిస్తున్న కానిస్టేబుల్స్