విద్యుత్తు నియంత్రికల కోసం జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులు డబ్బులు చెల్లించారని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్‌రావు తెలిపారు. ముందుగా అత్యవసరమైన వారికి నియంత్రికలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం ఎర్రగుంట్ల విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తు ఇచ్చేందుకు రూ.75 కోట్లతో అవసరమైన పనులు జరుగుతున్నాయని సీఎండీ తెలిపారు. సెప్టెంబరు నెలాఖరుకు ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద నిర్మించబోతున్న ఉక్కుపరిశ్రమకు సంబంధించి ఎంత విద్యుత్, ఎప్పటికి అవసరమవుతుందన్న విషయాలను పరిశీలించేందుకు వచ్చినట్లు సీఎండీ వెల్లడించారు.
'నియంత్రికల ఏర్పాటులో ప్రాధాన్యం'
ఎర్రగుంట్ల విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాన్ని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్‌రావు పరిశీలించారు. జిల్లాలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తు ఇచ్చేందుకు రూ.75 కోట్లతో అవసరమైన పనులు జరుగుతున్నాయని సీఎండీ తెలిపారు.
apspdcl cmd