రాయచోటిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని సీఎండీ హరనాధరావు తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటి దాతలు ఏర్పాటుచేసిన తాగు నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు ,సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ట్రాన్స్ఫార్మర్లను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందజేస్తామన్నారు. కడప జిల్లాలో తాగునీటి పథకాలకు విద్యుత్ కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు తమ జోన్ పరిధిలో లో 60 వేల మంది రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. ప్రభుత్వం నుంచి 50000 కనెక్షన్లకు అనునతులు లభించాయన్నారు. త్వరలోనే రైతులందరికీ ట్రాన్స్ఫార్మర్లలతోపాటు విద్యుత్ స్తంభాలు ఇతర సామాగ్రిని అందజేస్తామన్నారు. సబ్స్టేషన్ల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, కొత్త వాటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.విద్యుత్ బకాయిల చెల్లింపులకు వినియోగదారులకు సహకరించాలని.. బిల్లు పొందిన 30 రోజుల లోపు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించిన విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించి బకాయిలు గాను రూ. 2500 కోట్లు నిధులు ఎస్పీడీసీఎల్ చెల్లిందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సూపర్నెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు, జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ల డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
సకాలంలో విద్యుత్ బకాయిలను చెల్లించాలి.. - kadapa district
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
![సకాలంలో విద్యుత్ బకాయిలను చెల్లించాలి..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4067462-729-4067462-1565171158030.jpg)
APSPDCL CMD. Harinadrao visit to the rayachoti apspdcl office at kadapa district