ఎస్ఈసీ బాధ్యతల నుంచి రమేశ్ కుమార్ను తొలగించటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కడప ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం మూడేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయటంతోనే ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. నూతన ఎస్ఈసీగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును నియమించటం శుభ పరిణామం అన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాతం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని మంగంపేట గ్రామ సచివాలయంలో...పేదలకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. పేదలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని మిథున్ రెడ్డి చెప్పారు.
నూతన ఎస్ఈసీ నియామకం శుభపరిణామం: ఎంపీ మిథున్ రెడ్డి - ఎంపీ మిథున్ రెడ్డి వార్తలు
ఎస్ఈసీ బాధ్యతల నుంచి రమేశ్ కుమార్ను తొలగించటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కడప ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేశారు. నూతన ఎస్ఈసీ నియామకంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.
నూతన ఎస్ఈసీ నియామకం శుభపరిణామమన్న ఎంపీ మిథున్ రెడ్డి
TAGGED:
ఎంపీ మిథున్ రెడ్డి వార్తలు