కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 75 హోంగార్డు పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో.. జిల్లాకు చెందినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామన్నారు.
ఈ ఉద్యోగాలకు పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించినట్టు తెలిపారు. డిగ్రీతో పాటు బీటెక్, ఎంటెక్ చదివిన అభ్యర్థులు సైతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కేటాయిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.