ఉద్యోగాలు 75.. దరఖాస్తులు10 వేలకు పైగా.. - కడప న్యూస్
కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 75 హోంగార్డ్ ఉద్యోగాలకు 10 వేల 445 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపికలు జరుగుతాయని అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఉద్యోగాలు 75.. దరఖాస్తులు10 వేలకు పైగా..
కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 75 హోంగార్డ్ ఉద్యోగాలకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. డిసెంబర్ 26 నుంచి 31 వరకు మొత్తం 10 వేల 445 దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. జనవరి రెండో వారంలో అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపికలు జరుగుతాయని చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. హోంగార్డు ఉద్యోగాలకు ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ విద్యార్థులు దరఖాస్తు చేయడం విశేషం.