'ఆ మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలి' - latest news of thulasi reddy speech
చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రను అడ్డుకోవడం... వాహనంపై దాడి చేయడం, దురదృష్టకరమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. పోలీసుల వైఫల్యం వలనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి తీసుకునే యాత్రకు బయలుదేరిన వ్యక్తిపై దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ను తక్షణం అరెస్టు చేయాలని , డీజీపీ ,హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.