ఈ నెలాఖరులోగా.. ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే ఉద్యమం తప్పదని ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. ఉద్యమం చేపడితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
APNGO : ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే.. - ap ngo latest news
ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యలపై.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే.. ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
![APNGO : ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే.. apngo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13723187-666-13723187-1637753963953.jpg)
కడప ఎన్జీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని సంఘాలనూ కలుపుకొని రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని సంఘాల అభిప్రాయాలనూ తీసుకుని త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని సంఘాల నాయకులనూ పిలిపించి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:స్టార్మ్ పోలీసింగ్‌లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్.. సీఎం జగన్ అభినందన