పీఆర్సీపై సీఎం జగన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీఎన్జీవో డిమాండ్ చేసింది. కడప ఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. వైకాపా ఎన్నికల హామీలో చెప్పిన విధంగా సీపీఎస్‌ను తక్షణే రద్దు చేయాలని కోరారు.
కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటం అంతమంచిది కాదన్నారు. మరో రెండు మూడు నెలలు వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఒక వేళ కాదని ఎన్నికలు నిర్వహిస్తే ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఆ పరిణామాలకు ఎన్నికల కమిషనరే బాధ్యత వహించాలని కోరారు. సీఎం జగన్ తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో పకడ్బందీగా నడుస్తోందని వ్యాఖ్యానించారు.