పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి APCC Media Chairman Tulasi Reddy: మాట తప్పడం మడమ తిప్పడం సీఎం జగన్కు నిత్య కృత్యంగా మారిందని, పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డిఎద్దేవా చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక హామీ అమలు విషయంలో మాట తప్పారని పేర్కొన్నాడు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఉద్యోగులకు మాట ఇచ్చి ఓట్లు పొంది అధికారం ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారని తులసిరెడ్డి విమర్శించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై స్పందించిన తులసిరెడ్డి... సీఎం జగన్ గతంలో వీలైనంత ఎక్కువమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, దాదాపు లక్ష మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా వారిలో కేవలం 10,671 మందిని మాత్రమే రెగ్యులర్ చేసి జగన్ మాట తప్పారని విమర్శించారు.
contract employee regularization: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కానీ..!
రైతు భరోసా క్రింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 12,500 ఇస్తానని మాట ఇచ్చి అందులో రూ. 5000 కోత పెట్టీ మాట తప్పారని ఎద్దేవా చేశాడు.
యువతకు ఇచ్చిన హామీల విషయంలో సైతం జగన్ మాట తప్పారని తులసిరెడ్డి విమర్శించారు. మద్యం పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్ మద్యం నిషేధం విషయంలో కూడా మాట తప్పారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, కరెంటు చార్జీల విషయంలో సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. రాజధాని, పోలవరం విషయంలో సైతం జగన్ మాట తప్పారని పేర్కొన్నారు. ఇన్ని హామీలు ఇచ్చిన జగన్ ఆ హామీల అమలు విషయంలో మాట తప్పారని తులసిరెడ్డి విమర్శించాడు. మాట తప్పిన నాయకులను ఓడించి ఇంటికి పంపాలని జగనే చెప్పారని తులసి రెడ్డి అన్నారు. జగన్ చెప్పినట్లే ఆయనను, ఆయన పార్టీ నాయకులను ఓడించి ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్న మయిందని తులసిరెడ్డి జోస్యం చెప్పారు.
Cabinet Decision on GPS: ఓపీఎస్ పునరుద్ధరించలేం.. జీపీఎస్ తీసుకొస్తున్నాం...
మాట తప్పడం మడమ తిప్పడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నిత్య కృత్యంగా మారింది. మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఓపీఎస్, లక్ష మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో మాట తప్పాడు. ప్రతి రైతుకు సంవత్సరాని 12వేల రూపాయలు ఇస్తానని ప్రకటించిన జగన్ 5వేల రూపాయలు కోత కోసి మాట తప్పాడు. ప్రతి నియోజక వర్గంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు. యువత విషయంలో... 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ నిరుద్యోగులను మోసం చేసి మాట తప్పాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పిన జగన్ ఆ విషయంలో సైతం మాట తప్పాడు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ రద్దు చేయలేం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించలేమని మాట తప్పాడు. తులసిరెడ్డి, ఏపీసీసీ మీడియా చైర్మన్