ప్రఖ్యాత లెదర్ కంపెనీ అపాచీ ఇంటిలిజెంట్ సెజ్ ఏర్పాటుకు ఆతిథ్యమిస్తున్నట్లు కడపజిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పులివెందుల పట్టణ అభివృద్ధి సంస్థ (పాడా) పరిధిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్ లో... 27 ఎకరాలను అపాచీ కంపెనీకి కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటిలిజెంట్ ఎస్.ఈ.జెడ్ పేరుతో ప్రారంభిస్తున్న లెదర్ పరిశ్రమ.. చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తీలోని ఇనగళూరు వద్ద ఉన్న ప్రధానశాఖకు అనుబంధంగా ఉందని వివరించారు. ఈనెల 24వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాచీ పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు .
కడపలో అపాచీ లెదర్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు - కడపలో అపాచీ లెదర్ కంపెనీ తాజా సమాచారం
కడపలో అపాచీ లెదర్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నారు. ఈ మేరకు పులివెందుల పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్ లో... 27 ఎకరాలను అపాచీ ఫుట్ వేర్ కంపెనీకి కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కడపలో అపాచీ లెదర్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు