TDP PRAVEEN KUMAR REDDY : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు అరెస్టైన మరో ఆరుగురికి బెయిల్ లభించింది. ప్రొద్దుటూరులో గత నెల 13న వైకాపా-తెదేపా శ్రేణుల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనలో ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. సుమారు నెల రోజులపాటు జైల్లోనే ఉన్న ప్రవీణ్ రెడ్డికి ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ప్రొద్దుటూరు తెదేపా ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్ - వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు
TDP PRAVEEN KUMAR REDDY: ప్రొద్దుటూరు తెదేపా ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మాంజురైంది. ప్రొద్దుటూరులో గత నెలలో జరిగిన అల్లర్లలో పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.
తెదేపా ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి