ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం - tdp

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రొద్దుటూరు అభ్యర్థి లింగారెడ్డితో కలిసి ఆయన కూరగాయల మార్కెట్​లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు.

ప్రొద్దుటూరులో సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 30, 2019, 7:44 PM IST

ప్రొద్దుటూరులో సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం
కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు అభ్యర్థి లింగారెడ్డితో కలిసి ఆయన కూరగాయల మార్కెట్​లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. మార్కెట్ లో ని పలు సమస్యలను వ్యాపారులు సీఎం రమేశ్ కు విన్నవించుకున్నారు. సమస్యలపరిష్కారానికికృషి చేస్తానని ఆయనహామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు పురపాలక పరిధిలోని కొత్త మార్కెట్​ అభివృద్ధికి, ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు.

ఫ్యాన్​కు ఓటేస్తే మోదీకు ఓటేసినట్లే...
ప్రధాని మోదీ, వైకాపా అధినేత జగన్​పై సీఎం రమేశ్​ మండిపడ్డారు. వ్యాపార సంఘాల నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన... ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే, మోదీకి వేసినట్లేనని అన్నారు. గడచిన ఐదేళ్ల తెదేపా పాలనలో చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఏం చేయలేదని జగన్​ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్​కు అధికారం ఇస్తే నరేంద్ర మోదీకి ఇచ్చినట్లేనని అన్నారు. తెదేపాకే మళ్లీ పట్టం కట్టాలని సీఎం రమేష్ కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details