AP Deputy CM Amjad Basha : కడపలో వృద్ధాప్య పింఛన్లు తొలగిస్తున్నారని ప్రశ్నించిన ఎంఆర్పీఎస్ నాయకుడిపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడపలోని రవీంద్రనగర్‌లో ఉపముఖ్యమంత్రి పర్యటించారు. పర్యటనలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రిని పింఛన్ల తొలగింపుపై ఎంఆర్పీఎస్ నాయకుడు ప్రశ్నించారు. కడపలో నాలుగువేలకు పైగా పింఛన్లు తొలగించారని ఎంఆర్పీఎస్ నాయకుడు ఉప ముఖ్యమంత్రిని నిలదీశాడు. దీంతో ఆగ్రహంతో ఉపముఖ్యమంత్రి.. ఎవరి పింఛన్లు తొలగించారో చూపించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో దూషించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పింఛన్ల తొలగింపును ప్రశ్నించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి - పింఛన్ల తొలగింపు
AP Deputy CM Amjad Basha : పింఛన్ల తొలగింపుపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాను ప్రశ్నించినందుకు ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాకుండా ప్రశ్నించిన ఎంఆర్పీఎస్ నాయకుడ్ని పరుష పదజాలంతో దుషించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమల్లో వైరల్‌గా మారింది
ఉపముఖ్యమంత్రి