ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. కడప మున్సిపల్ మైదానంలో ఏపీ సీఎం కప్ హాకీ 2020 పోటీలను ఆయన ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి హాకీ ఆడి పోటీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రతి జిల్లాలో రెండుసార్లు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కడప హాకీ క్రీడకు పుట్టినిల్లు అని కొనియాడారు. మూడు రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతాయని నిర్వహకులు చెప్పారు.
ఏపీ సీఎం కప్ హాకీ-2020 పోటీలు ప్రారంభం - ap deputy cm
కడపలో ఏపీ సీఎం కప్ హాకీ 2020 పోటీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ క్రీడలకు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారని ఆయన అన్నారు.

ఏపీ సీఎం కప్ హాకీ 2020 పోటీలు ప్రారంభం
ఏపీ సీఎం కప్ హాకీ 2020 పోటీలు ప్రారంభం
ఇదీచదవండి.ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి