రాజంపేట నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను కడప జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. నియోజవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.... 281 చొప్పున ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించారు. వీటన్నింటిని నిన్న సాయంత్రం పోలింగ్ తర్వాత రాజంపేట అన్నమాచార్య బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌కి తీసుకువచ్చారు. నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్న వీరబల్లి, సుండుపల్లి మండలాల నుంచి ఈవీఎంలు రాత్రి 12 గంటలకు చేరుకున్నాయి. వీటిని రాత్రంతా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. నేటి ఉదయం ప్రత్యేక వాహనంలో కడపలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు రిటర్నింగ్ అధికారి నాగన్న పర్యవేక్షణలో తరలించారు.
స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంల తరలింపు - CDP
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని 281 పోలీంగ్ కేంద్రాలలోని ఈవీఎంలను ప్రత్యేక వాహనంలో కడపలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు