అదుపుతప్పిన ఆటోకు ప్రమాదం.. ఒకరి మృతి - ప్రమాదంలో ఒకరి మృతి
అదుపు తప్పిన ఆటో.. మోరీని ఢీ కొట్టిన ఘటనలో.. ఒకరు దుర్మరణం పాలయ్యారు.
కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి వద్ద ఆటో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు . క్షతగాత్రులను స్థానికులు బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రయాణికులతో కలిసి బద్వేలులో బయల్దోరిన ఆటో... చెన్నంపల్లి వద్దకు రాగానే అదుపుతప్పింది. అక్కడే ఉన్న మోరీని ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న వృద్ధుడు సుబ్బరామిరెడ్డి.. తీవ్ర గాయాలపాలై చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.