ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kadapa: నూర్పిడి యంత్రం కింద పడి ఇద్దరు కూలీలు మృతి - Kadapa district

కడప జిల్లా దువ్వూరు మండలం బయనపల్లెలో నూర్పిడి యంత్రం కింద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. యంత్రంపై కూర్చుని పొలాల్లో ప్రయాణిస్తుండగా గట్టు ఎక్కే ప్రయత్నంలో యంత్రం బోల్తాపడింది.

ACCIDENT
కూలీల మృతి

By

Published : Jun 28, 2021, 8:04 PM IST

వారంతా దినసరి కూలీలు. పొట్ట కూటి కోసం పొలం పనులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్న వారిలో ఇద్దరిని మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం బయనపల్లెలో జరిగింది. పొలాల్లో వేరుసెనగ నూర్పిడి యంత్రం కింద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు.

మీర్జాఖాన్‌పల్లె గ్రామానికి చెందిన కూలీలు యంత్రంపై కూర్చుని వెళ్తుండగా పొలంలో గట్టు ఎక్కే క్రమంలో యంత్రం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుగుణ, సుబ్బరాయుడు అనే కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై అరుణ్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఎంతకీ పెళ్లి చేసుకోట్లేదనే ఆక్రోశంతో..

ABOUT THE AUTHOR

...view details