వివేకా హత్యకేసులో కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డికి నార్కోఅనాలసిస్ పరీక్షలకు కోర్టు అనుమతి లభించింది. పోలీసులు నిన్నే శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇవాళ నార్కో అనాలసిస్ పరీక్షలపై కోర్టు నిర్ణయం కోసం పులివెందులలో పిటిషన్ వేశారు. ఇప్పటికే వాచ్‌మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ పరీక్షలకు పులివెందుల కోర్టు అనుమతులు జారీ చేసింది. దీంతోరంగన్న,శేఖర్‌రెడ్డికి ఒకేసారి హైదరాబాద్‌లో నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
వివేకా హత్యకేసు.. నార్కో పరీక్షకు కోర్టు అనుమతి
వివేకా హత్యకేసులో శేఖర్‌రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షకు పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసులు పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. శేఖర్ రెడ్డి సమ్మతితోనే పరీక్షకు అనుమతిస్తున్నట్టు కోర్టు తెలిపింది.
వివేకా హత్యకేసులో మరో నార్కో పరీక్షకు పోలీసుల పిటిషన్