కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరం కూడలిలో రాత్రికి రాత్రే అన్నమయ్య విగ్రహం ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది. ఉదయం విగ్రహాన్ని చూసి స్థానికులు ఆశ్యర్యపోయారు. ప్రొద్దుటూరులో ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదంటూ ఇటీవల జిల్లా కల్లెకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య విగ్రహం ప్రత్యక్షం కావటం చర్చనీయాంశమైంది.
సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రసాదరావు అన్నమయ్య విగ్రహాన్ని తొలగించారు. రాత్రికి రాత్రే విగ్రహం ఎవరు ఏర్పాటు చేశారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.