ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి - kadapa district

పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల 612వ జయంతి... ఆయన జన్మస్థలి తాళ్ళపాకలో వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, మంగళ హారతులతో జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు.

kadapa district
వైభవంగా శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు

By

Published : May 8, 2020, 9:18 PM IST

శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో వేదమంత్రాల నడుమ వేడుకలు నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యల జన్మస్థలి తాళ్ళపాక గ్రామంలో... స్వామివారి జయంతి వేడుకలు హంగుఆర్బాటం లేకుండా నిరాడంబరంగా జరిగాయి. స్వామివారి ధ్యాన మందిరంలోని విగ్రహానికి వేద పండితులు పంచామృతాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని గజమాలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, మంగళహారతులతో జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. .

ABOUT THE AUTHOR

...view details