ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PATENT RIGHTS: కడప ప్రొఫెసర్ ప్రతిభ.. 18 ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కులు!

సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నఆధునిక యుగంలో.. వాహనాల నిర్వహణ ఖర్చు, థర్మల్‌ కూలింగ్‌ టవర్లకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న పరిస్థితి. అయితే మెకానికల్‌ విభాగం, ఆటోమొబైల్‌ రంగంలో పరిశోధనలు చేసిన ఓ వ్యక్తి.. తక్కువ ఖర్చుతో వాహనాలు నడపడం, డీజిల్‌ ఆదా చేయడం వంటి వాటికి సరికొత్త ఫార్ములా కనుగొన్నారు. ఈ విధంగా 18 విభాగాలకు పేటెంట్‌ హక్కులు సాధించారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే సహకారం అందిస్తానని చెబుతున్నారు.

professor Dr. Krishnamohan
professor Dr. Krishnamohan

By

Published : Aug 28, 2021, 3:44 PM IST

18 ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కులు పొందిన కడప ప్రొఫెసర్

కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల ఏఐటీఎస్​ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా డాక్టర్‌ కృష్ణమోహన్‌ రాజు పనిచేస్తున్నారు. 1998 నుంచి నేటివరకు ఆటోమొబైల్ రంగం, మెకానికల్ విభాగాల్లో ఎన్నో పరిశోధనలు చేసి అద్భుతమైన విజయాలు సాధించారు. 2009 నుంచి ఇప్పటివరకు 60 విభాగాలకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోగా.. 18 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు మంజూరు అయ్యాయి.

వాహనాలు నడిచేటప్పుడు.. 35 శాతం వేడి వాయురూపంలో గాలిలో కలిసిపోతుంది. కానీ కృష్ణమోహన్‌ కనుగొన్న విధానంలో వేడి రూపంలో వెళ్లే వాయువును.. ఐసోథర్మల్‌ కంప్రెస్ట్‌ వాయువును ఉపయోగించడానికి వినియోగించవచ్చని చెబుతున్నారు. సాధారణంగా నాలుగు, ఆరు చక్రాల వాహనాల్లో మల్టీ సిలిండర్ ఇంజన్ వాడుతుంటారు. దీనివల్ల ఉష్ణ, రాపిడి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. యంత్ర సామర్థ్యం 5నుంచి 10 శాతం తగ్గుతుంది. కానీ "ఏ డబుల్ క్రాంక్ ఆపోజిట్ సిలిండర్ ఇంజిన్ విత్ ఫ్లైవీల్ హైస్పీడ్".. అనే పద్ధతి ద్వారా ఇంజిన్ సామర్థ్యం 6 రెట్లు వేగం పెరుగుతుందని కృష్ణమోహన్‌రాజు అంటున్నారు. అంతేకాకుండా సాధారణ యంత్రాల కంటే తాను తయారు చేసిన వాటి ధర 30 శాతం తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

కొవ్వత్తి.. కరిగిన పదార్ధం వృథాగా పోకుండా..

కొవ్వొత్తి వెలిగించినప్పుడు కరిగిన పదార్ధం వృథాగా పోకుండా.. యథావిధిగా ఎంతసేపైనా వెలిగే విధంగా కృష్ణమోహన్‌రాజు ఓ ఫార్ములాను కనుగొన్నారు. థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో విద్యుతుత్పత్తి సమయంలో వేడినీటిని తట్టుకోవడానికి పెద్దపెద్ద కూలింగ్‌ టవర్లు నిర్మిస్తుంటారు. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. కానీ కృష్ణమోహన్‌ రాజు తయారు చేసిన ఫార్ములా ద్వారా పెద్దపెద్ద కూలింగ్‌ టవర్లు అవసరం లేకున్నా.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో కూలింగ్‌ టవర్లు ఏర్పాట్లు చేసే విధంగా చేయవచ్చు. ఈయన చేస్తున్న పరిశోధనలపై అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే.. తన వద్దనున్న 18 పేటెంట్ హక్కులకు సంబంధించిన ఫార్ములాను వారికి వివరించడానికి సహకరిస్తానని ప్రొఫెసర్ కృష్ణమోహన్ రాజు అంటున్నారు.

నాకు పరిశోధనలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, థామస్ ఆల్వా ఎడిసన్, ఐన్ స్టీన్ నాకు స్ఫూర్తి. వారి స్థాయికి ఎదగాలని చిన్నప్పటి నుంచే లక్ష్యంగా పెట్టుకున్నా. వెహికిల్ విండ్ ఫ్రిక్షన్ తగ్గించడంపై చాలా పరిశోధనలు చేశాను. పీహెచ్ డీలోనూ నా పరిశోధన అంశం ఇదే. - ప్రొఫెసర్ కృష్ణమోహన్ రాజు

ఇదీ చదవండి:

Accident: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌..నిద్రలోనే తండ్రి, కుమారుడు

Covid 19 Origin: కరోనా పుట్టుకను తెలుసుకోవటం అసాధ్యమా?

ABOUT THE AUTHOR

...view details