కరోనా నియంత్రణ చర్యలకు సహకరించేందుకు కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజ్.. ముందుకు వచ్చింది. కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎంవీ నారాయణ ఐదు లక్ష రూపాయల చెక్కును ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎస్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్వర్ణలత, బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నమాచార్య కళాశాల విరాళం రూ. 5 లక్షలు - undefined
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం తన వంతు సాయం అందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 5 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చింది.
కరోనాపై పోరుకు అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఐదు లక్షల ఆర్థిక సాయం