కడప జిల్లా పులివెందులలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణమ్మ మృతి చెందడంతో బంధువులు రిమ్స్ వద్ద అందోళన చేశారు.
అంగన్వాడీ టీచర్ మృతి.. కరోనా టీకా వల్లేనంటూ ఆందోళన - పులివెందుల అంగన్వాడీ టీచర్ మృతి వార్తలు
పులివెందులలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణమ్మ అనే మహిళ మృతి చెందింది. కరోనా టీకానే కారణమంటూ కార్మిక సంఘాలు రిమ్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించాయి.
అంగన్వాడీ టీచర్ మృతి.. కరోనా టీకా వల్లేనంటూ ఆందోళన
పులివెందులకు చెందిన నారాయణమ్మ ఈ నెల 2న కరోనా టీకా వేసుకుంది. ఆమెను గంటపాటు పరిశీలనలో ఉంచారు. ఆరోగ్యం బాగుండటంతో ఇంటికి పంపించారు. గురువారం ఆమె అస్వస్థతకు గురికావడంతో రిమ్స్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. కరొనా టీకా వల్లే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు రిమ్స్ వద్ద అందోళన చేశాయి. రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి.