1న కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన - andhrapradesh Chief Minister's overseas trip as a family on august 1st
అసెంబ్లీ సమావేశాలతో బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి జగన్... ఒకటిన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి... 5న తిరిగి అమరావతికి వస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు ఒకటిన జెరూసలెం పర్యటనకు వెళ్లనున్నారు. 5న అమరావతికి తిరిగి వస్తారు. ఈ నెల 30న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అదేరోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళతారు. మరుసటి రోజు ఆయన జెరూసలెం పర్యటన ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 15న తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లి 24న తిరిగి వస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ ప్రవాసాంధ్రులతో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. 17న డల్లాస్లోని కె బెయిలీ హాచిసన్ కన్వెన్షన్ సెంటర్లో "తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా" వారి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కార్యక్రమంలో పాల్గొంటారు.
TAGGED:
ys jaganmohan reddy