ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వృద్ధి 16.16 శాతం ' - ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ తాజా వార్తలు

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏడాది కాలంలో 16.16 శాతం వృద్ధి సాధించిందని ఆ బ్యాంక్ ఛైర్మన్ రాకేశ్ తెలిపారు. కడపలోని ప్రధాన కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు.

andhra pragathi bank growth
andhra pragathi bank growth

By

Published : Jun 18, 2021, 5:21 PM IST

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ గడిచిన ఏడాది కాలంలో 16.16 శాతం వృద్ధి రేటు సాధించిందని ఆ బ్యాంక్ చైర్మన్ రాకేష్ వెల్లడించారు. కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రూ.36,639కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించామన్నారు. ఐదు జిల్లాల్లో కలుపుకొని 82 అర్బన్, 144 సెమీ అర్బన్, 326 గ్రామీణ శాఖలతో మొత్తం ఐదు 552 శాఖలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 109 ఏటీఎంలు, 995 వ్యాపార ప్రతినిధులతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ముందుకు సాగుతోందన్నారు. రానున్న 2021- 22 ఏడాదికి సంబంధించి 41 వేల కోట్ల రూపాయలు వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు.

ఇదీ చదవండి:viveka murder case: కొత్తగా నలుగురిని విచారిస్తున్న సీబీఐ

ABOUT THE AUTHOR

...view details