AP driver died in Bihar.. బిహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన ట్రక్ డ్రైవర్ మృతి చెందాడు. జిల్లాలోని మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాణా ప్రతాప్ కళాశాల సమీపంలో.. ట్రక్కులో టమోటాలు దించేందుకు వచ్చాడు. అక్కడినుంచి వాహనం దిగి కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతన్ని పోలీసులు సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రాష్ట్రంలోని కడప జిల్లా కోట కోటోలుకు చెందిన మహ్మద్ హుస్సేన్ కుమారుడు సాల్ఫ్ ఖాజావలి(36) అని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భబువా సదర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బిహార్‌లో రోడ్డు ప్రమాదం.. రాష్ట్రానికి చెందిన ట్రక్ డ్రైవర్ మృతి - driver died in road accident
Driver died in Accident.. బిహార్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ట్రక్ డ్రైవర్ మృతి చెందాడు. కైమూర్ జిల్లాలోని మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాణా ప్రతాప్ కళాశాల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భబువా సదర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
1