ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల అప్పు.. రూ.55వేల కోట్లకుపైనే..: కేంద్రం - ycp news

AP Public Sector Undertakings incurred debts updates: గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు.. దాదాపు రూ.55వేల కోట్లకు పైగా అప్పులు చేశాయని.. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పార్లమెంట్​లో తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానాల రూపంలో పలు కీలక వివరాలను బయటపెట్టారు.

ap map
ap map

By

Published : Mar 14, 2023, 8:21 PM IST

AP Public Sector Undertakings incurred debts updates: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రంగ సంస్థలు.. గత నాలుగేళ్లలో రూ. 55వేల కోట్లకు పైగా అప్పులు చేశాయని.. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లెక్కల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం రుణం రూ. 91,569 కోట్లుగా తేల్చింది. వీటిలో రాష్ట్ర విభజన అనంతరం తొలి ఐదేళ్లలో రూ.35,980 కోట్లు అప్పులు చేయగా.. ఈ నాలుగేళ్లలో అత్యధికంగా రుణాలు తీసుకున్నట్లు పేర్కొంది. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు బయటపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రం విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి 91,560 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంటుకు తెలిపింది. వీటిలో తొలి అయిదేళ్లలో రూ.35,980.11 కోట్ల రుణం తీసుకోగా, గత నాలుగేళ్లలో రూ.55,589.29 కోట్ల అప్పు చేసినట్లు రాజ్యసభకు చెప్పింది. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఈమేరకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

''2014వ సంవత్సరం జూన్ 3వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు 12 బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం.. రూ. 2,457.64 కోట్ల మేర ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో తీసుకొన్న మొత్తం రుణం కలిపితే..రూ. 91,027.04 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా, 2014 జూన్ నుంచి 2023 మార్చి వరకు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి(RSIDF) కింద.. నాబార్డు ఏపీ ప్రభుత్వానికి రూ. 10,568.34 కోట్ల రుణం ఇచ్చింది. అలాగే, లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ కింద రూ. 489.34 కోట్లు, మైక్రో ఇరిగేషన్‌ ఫండ్ కింద రూ. 616.13 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇవేకాకుండా, వేర్ హౌస్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫండ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ కింద రూ. 98.55 కోట్లు, ఇతర కార్యక్రమాల కింద రూ. 16,108.47 కోట్ల రుణం, ఇందులో ధాన్యం సేకరణ కోసం స్వల్ప కాలిక రుణం కింద 2018-19లో రూ.2వేల కోట్లు, 2019-20 నుంచి 2022-23 మధ్య కాలంలో రూ. 11,100 కోట్ల రుణాన్ని నాబార్డు అందించింది'' అని మంత్రి తన సమాధానంలో వివరించారు.

అనంతరం నవ్యాంధ్ర ఏర్పడే నాటికి రాష్ట్రంపై రూ.97,176.82 కోట్ల అప్పు ఉందని మంత్రి తెలిపారు. ఆ తర్వాత 2018-19లో రూ. 33,804 కోట్లు, 2019-20లో రూ. 44,202 కోట్లు, 2020-21లో రూ. 48,755 కోట్లు, 2021-22లో రూ. 27,530 కోట్ల అప్పు చేసినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. 2014 జులై నాటికి 11 ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు రూ. 2457.64 కోట్ల రుణం తీసుకోగా.. 2014-15లో 2 సంస్థలు రూ. 484.53 కోట్లు, 2015-16లో 3 సంస్థలు రూ. 125కోట్లు, 2016-17లో 4 సంస్థలు రూ. తొమ్మిది వందల కోట్లు, 2017-18లో 26 సంస్థలు రూ. 23,902.58 కోట్లు, 2018-19లో 14 సంస్థలు రూ. 10,568 కోట్ల అప్పులు తీసుకున్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ నివేదించింది.

ఇటీవలే 2019-20లో 17 ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,809 కోట్ల అప్పులు చేయగా.. 2020-21లో 29 సంస్థలు రూ. 28,749.06 కోట్లు, 2021-22లో 7 సంస్థలు రూ. 8,995.73 కోట్లు, 2022-23 ఆర్ధిక సంవత్సరం 2022 డిసెంబర్‌ 31 నాటికి ఐదు సంస్థలు రూ. 5,035.50 కోట్లు అప్పులు చేసినట్లు కేంద్రం వివరాలను బయటపెట్టింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details