ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

An Honor to the Four Young Men Who Climbed the Mountains: పర్వతారోహణలో దూసుకెళ్తున్న యువకులు..సవాళ్లు, ప్రతిసవాళ్లపై కార్యక్రమాలు - YSR District villages News

An Honor to the Four Young Men Who Climbed the Mountains: ప్రపంచంలోని ఎత్తైనా పర్వతాలను అధిరోహిచాలంటే మాటలు కాదు. ప్రతి క్షణం సవాళ్లతో కూడుకున్నది. కాస్త ఏమరపాటుగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాంటి రంగాన్ని ఎంచుకుని మున్ముందుకు సాగిపోతున్న నలుగురు యువకులకు యోగి వేమన విశ్వవిద్యాలయం వారు ఘనంగా సత్కరించారు.

Young_Men_Who_Climbed_the_Mountains
Young_Men_Who_Climbed_the_Mountains

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 2:15 PM IST

పర్వతారోహణలో దూసుకెళ్తున్న యువకులు..సవాళ్లు, ప్రతిసవాళ్లపై కార్యక్రమాలు

An Honor to the Four Young Men Who Climbed the Mountains: సంకల్ప బలం ఉండాలే గానీ.. ఎంతటి కష్టాన్నైనా ఇట్టే దాటేయవచ్చని నిరూపిస్తున్నారు.. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలకు చెందిన యువకులు. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల్ని అధిరోహించడమే పనిగా పెట్టుకుని.. ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా, పర్వతారోహణలో ఎదురైనా సవాళ్లు, అధిగమించిన విధానాలపై యువతకు అవగాహన కల్పిస్తూ.. ప్రశంసలు, అవార్డులు, సన్మానాలు అందుకుంటున్నారు. తాజాగా కడప సీపీ బ్రౌన్‌ పరిశోధన కేంద్రంలో పర్వతారోహణలో వాళ్లకి ఎదురైనా సవాళ్లు, ఎదుర్కొన్న అవరోధాలు, అధిగమించిన విధానాలను విద్యార్థులతో పంచుకున్నారు. మరి ఆ విశేషాలెేంటో, ఆ పర్వతారోహకుల మనోగతలేంటో ఈ కథనం చదివి మనం కూడా తెలుసుకుందామా..

Mountaineers are Honored at the CP Brown Center:పర్వతారోహణ అంటే మాటలు కాదు. ప్రతిక్షణం సవాళ్లతో కూడుకున్నదే. కాస్త ఏమరపాటుగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాంటి రంగాన్ని ఎంచుకుని మున్ముందుకు సాగిపోతున్నారు ఈ నలుగురు యువకులు. ఎవరెస్ట్‌ సహా మిగిలిన పర్వాతాలను అధిరోహించిన వీరిని.. తాజాగా యోగి వేమన విశ్వవిద్యాలయం వారు సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఘనంగా సత్కరించారు.

Youth on organic products Business: ఉద్యోగాలు వదిలి.. ఆర్గానిక్​ ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న యువత

Awareness of Students on Mountain Climbing: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో విద్యార్థులకు ఈ నలుగురు పర్వతారోహణపై అవగాహన కల్పించారు. అధిరోహణ సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా దాటాలి..?, శారీరకంగా, మానసికంగా ఎంత సన్నద్ధంగా ఉండాలో వివరించారు. అనంతరం పర్వతారోహణ గురించి విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.

Suresh Babu Comments:ఈ వీడియోలో కనబడుతున్న యువకుడిపేరు సురేష్‌ బాబు. అతనిది కర్నూలు జిల్లా గోనగండ్ల స్వస్థలం. 18వ ఏటనే మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని పర్వతాలు అధిరోహిస్తానని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. మరోక పర్వతారోహకుడి పేరు హరిప్రసాద్.. ఇతను అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను కూడా 2017లోనే ఎవరెస్ట్‌ అధిరోహించాడు. ఆ సమయంలో అతనికి ఎదురైనా అనుభవాలను, అధిగమించిన విషయాలను విద్యార్థులతో పంచుకున్నాడు.

Interview with Group-1 Ranker Pradeepti: మహిళలపై అకృత్యాల నివారణకు కృషి చేస్తా..: గ్రూప్‌-1 ర్యాంకర్​ ప్రదీప్తి

Srilata Climbed Mount Kilimanjaro: కర్నూలు జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన సుందర్ రాజు కూడా 2017లో మౌంట్ ఎవరెస్ట్‌ అధిరోహించాడు. ఆ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు వివరించాడు. వీరు ముగ్గురే కాక వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలానికి చెందిన శ్రీలత పెళ్లైనా కూడా తన కలల దిశగా అడుగేస్తూ.. ముందుకు సాగుతోంది. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలానికి చెందిన ఈమె.. 2018లో కిలిమంజారో పర్వతారోహణ చేసింది. కడప సీపీ బ్రౌన్‌ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు.. పర్వాతారోహకులు తమ కష్టాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో ప్రదర్శించారు.

Youngman talent in Weight Lifting: ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యం.. పవర్​ లిఫ్టింగ్​లో యువకుడి సత్తా

ABOUT THE AUTHOR

...view details