ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో తెగిపడ్డ చిన్నారి చెయ్యి - అక్కాయ పల్లి విద్యుత్ ప్రమాదం తాజా సమాచారం

కడపలోని అక్కాయ పల్లిలో విద్యుత్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి చెయ్యి తెగి పడగా.. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

electrical accident
విద్యుత్ ప్రమాదం

By

Published : Apr 5, 2021, 8:28 AM IST

చిన్నపాటి నిర్లక్ష్యం తల్లీబిడ్డలను ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ ప్రమాదంలో బిడ్డ చెయ్యి తెగిపోగా రక్షించేందుకు వెళ్లిన తల్లి తీవ్రగాయాలపాలైన సంఘటన కడపలో చోటుచేసుకుంది. కడప అక్కాయపల్లెకు చెందిన ఫరీదా, సయ్యద్‌ ఆరిపుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. సయ్యద్‌ ఆరిపుల్లా జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కాయపల్లెలో ఫరీదా, ఆమె పిల్లలు రెండో అంతస్తులో కాపురముంటున్నారు. వీరు ప్రతి రోజు ఇంట్లో పోగైన చెత్తను ప్లాస్టిక్‌ బకెట్‌లో వేసి తాడు సాయంతో కిందకు దించేవారు. ఆదివారం రాత్రి వీరి పెద్ద కుమార్తె అయిషా(13) బకెట్‌కు తాడు బదులు పాత విద్యుత్తు తీగను కట్టింది. విద్యుత్తు తీగకు అక్కడక్కడ అతుకులున్నాయి. వీరు ఉంటున్న ఇంటికి అతి సమీపంలో 11 కేవీ విద్యుత్తు తీగలు వెళుతున్నాయి. బకెట్‌ను కిందకు దించే సమయంలో ప్రమాదవశాత్తూ అతుకులున్న విద్యుత్తు తీగకు 11కేవీ విద్యుత్తు తీగల నుంచి విద్యుత్తు సరఫరా కావడంతోపాటు అక్కడే ఉన్న స్టీల్‌ స్తంభానికి కూడా విద్యుత్తు సరఫరా అయింది. ఒక్కసారిగా అధిక విద్యుత్తు ప్రసారం కావడంతో అయిషా చెయ్యి తెగి కిందపడింది. తన కుమార్తెను కాపాడేందుకు యత్నించి ఫరీదా తీవ్రంగా గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details