ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధమని ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా పేర్కొన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా కడప పాత కలెక్టరేట్ వద్ద 15 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ముస్లింలకు మద్దతుగా ఆయన ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తానన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానానికి సీఎంతో మాట్లాడతానని చెప్పారు. ఎన్డీయేలో చేరాల్సిన దౌర్భాగ్యం వైకాపా ప్రభుత్వానికి లేదన్నారు. భవిష్యత్తులోనూ భాజపాతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీసీలు, మైనారిటీల కోసం పనిచేస్తున్న పార్టీ వైకాపా అని అంజద్‌బాషా ఉద్ఘాటించారు.
అలా అయితే రాజీనామా చేస్తా: ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా - amjadh basha on NRC

ఎన్‌ఆర్‌సీపై ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా వ్యాఖ్యలు
15:17 February 15
ఎన్‌ఆర్‌సీపై ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా వ్యాఖ్యలు
ఎన్‌ఆర్‌సీపై ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా వ్యాఖ్యలు
Last Updated : Feb 15, 2020, 8:01 PM IST
TAGGED:
amjadh basha on NRC