విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల భారీ పరిహారం అందించి ప్రతి ఒక్కరి హృదయాలలో ముఖ్యమంత్రి జగన్ చెరగని ముద్ర వేశారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కొనియాడారు. ఘటన జరిగిన నాలుగు రోజులకే మంత్రుల ద్వారా మృతుల కుటుంబాలకు పరిహారం అందించటం జరిగిందన్నారు. ఇంత పెద్ద పరిహారం గతంలో ఎన్నడూ ఇవ్వలేదన్నారు.
'సీఎం జగన్ ప్రజల పక్షపాతి' - 'సీఎం జగన్ ప్రజల పక్షపాతి'
విశాఖ ఘటనలో మృతుల కుటుంబాలకు సత్వర పరిహారం అందించి జగన్ ప్రతి ఒక్కరి హృదయాలలో చెరగని ముద్ర వేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కొనియాడారు. గతంలో ఎవరూ ఇవ్వని విధంగా ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించారన్నారు.
'సీఎం జగన్ ప్రజల పక్షపాతి'
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ ప్రజలలో ధైర్యాన్ని నింపుతూ.. జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం లేకపోయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తూ ప్రజల పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్నారన్నారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.