కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్ కడపలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు, మహిళ రక్షణ అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలో ఎర్రచందనం రవాణాతోపాటు ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మహిళలు, సామాన్యులు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్బురాజన్ వివరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఛేదించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది, సిట్ దర్యాప్తు ముగిసిందా లేదా అన్న అంశాలు సమీక్షించిన తర్వాత సమగ్ర వివరాలు అందిస్తారని వివరించారు.
" వివేకా కేసు పూర్వాపరాలు సమీక్షించాలి" - kadapa new sp comments on ys viveka murder
కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్, ట్రాఫిక్ సమస్యలు, మహిళ రక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
![" వివేకా కేసు పూర్వాపరాలు సమీక్షించాలి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4717450-856-4717450-1570781745245.jpg)
నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న అమ్బురాజన్
Last Updated : Oct 11, 2019, 11:48 PM IST