కడప జిల్లా రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం చేసిన 3 రాజధానుల ప్రతిపాదనను తప్పుబట్టారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ అమరావతి అంటూ నినదించారు. రాజంపేట పాత బస్టాండ్ బైపాస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి శివాలయం మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. సీఎం జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ మహాత్ముడి విగ్రహాన్ని కోరారు. బోగస్ నివేదికలు, బోగస్ కమిటీలతో రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని చెంగల్రాయుడు ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తేదేపా వ్యతిరేకం కాదని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వికేంద్రీకరించాలని.. ఒక్కొక్క గ్రామంలో ఒక్కో కార్యాలయం ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. మనసు మార్చుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు.
'మండలాల్లో పరిపాలన వికేంద్రీకరణ చేయగలరా?' - రాజంపేటలో అమరావతి మద్దతు ర్యాలీ
సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ అమరావతి నినాదంతో తెదేపా నేతలు కడప జిల్లా రాజంపేటలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి తెదేపా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు.
రాజంపేటలో అమరావతికి మద్దతుగా నిరసన ర్యాలీ