ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 2, 2023, 7:36 PM IST

ETV Bharat / state

Funds Misuse: 'పనులు చేయకుండానే బిల్లులు.. కోటికిపైగా గోల్​మాల్​'

Funds Misuse in Chilankur Panchayat: గతంలో వేసిన పాత రోడ్లు పైనే బిల్లులు చేసుకున్నారని, పైపు లైన్లు వేయకుండానే వేసినట్లు బిల్లులు చూపి ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారనీ బీజేపీ ఎంపీటీసీ నవీన్ ఆరోపించారు. అధికారులను వివరణ కోరగా దాట వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది.

Etv Bharat
Etv Bharat

చిలంకూరు పంచాయతీలో కోటి రూపాయలు గోల్ మాల్ ఆరోపణలు

Funds Misuse in Chilankur Panchayat : వైయస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం చిలంకూరు పంచాయతీలో పనులు చేయకుండానే చేసినట్లు చూపి కోటి రూపాయలకు పైగా నిధులు స్వాహా చేశారని బీజేపీ ఎంపీటీసీ నవీన్ ఆరోపించారు. గతంలో వేసిన పాత రోడ్లు పైనే బిల్లులు చేసుకున్నారని, పైపు లైన్లు వేయకుండానే వేసినట్లు బిల్లులు చూపి ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారనీ అన్నారు. ఈ విషయమై నవీన్ పంచాయతీ సెక్రెటరీ మురళీ మోహన్​ను నిలదీయగా తన పిరియడ్​లో జరగలేదని తనకు రెండు రోజులు టైం ఇస్తే మీకు సమాధానం చెబుతానని దాటవేశారు.

20 లక్షల రూపాయల పనులు కూడా చేయలేదు :ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీయడంతో నిధులు గోల్ మాల్ జరిగిన విషయం బయటకొచ్చిందని ఎంపీటీసీ నవీన్ అన్నారు. పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, పైపులైను పనులు చేసినట్లు ఎం బుక్​లో రికార్డు చేసి బిల్లులు స్వాహా చేశారని అన్నారు. ఎం బుక్​లో నమోదు చేసిన కోటి రూపాయలకు పైగా పనులు ఎక్కడ చేశారో చూపించాలని అధికారులను డిమాండ్ చేశారు. అందులో కనీసం 20 లక్షల రూపాయల పనులు కూడా చేయలేదని ఆరోపించారు. ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులు ప్రజాభివృద్ధికి ఉపయోగించడం లేదని, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మింగేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు :గతంలో ఉన్న అధికారి కూడా బిల్లులకు సంబంధించిన పనులు ఎక్కడ చేశారో చూపించకుండా, అడిగితే వారు సమాధానం చెప్పకుండా దాటవేశారని, ట్రాన్స్​ఫర్​ చేయించుకోని వేరే చోటుకి వెళ్లారనీ నవీన్ అన్నారు. చిలంకూరు మేజర్ పంచాయతీలో జరిగిన కోటి రూపాయల నిధుల గోల్ మాల్​పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాలంటీర్లు ఇంటి పన్నులు తదితర పన్నులను కట్టాలని ఇంటి వద్దకు వచ్చి మరీ ప్రజలను పీడించి పన్నులు వసూలు చేస్తున్నారని స్థానిక నాయకులు మండిపడ్డారు. ఈ ప్రజాధనాన్ని వైఎస్సార్సీపీ నాయకులు కొల్లగొడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.

రెండు రోజులు సమయం కావాలన్న పంచాయతీ సెక్రటరీ :తనకు రెండు రోజులు సమయం ఇస్తే పూర్తి వివరాలు తెలియజేస్తానని ప్రస్తుత చిలంకూరు పంచాయతీ సెక్రటరీ మురళీ మోహన్​ తెలిపారు. తాను కొన్ని పనులు మాత్రమే పర్యవేక్షించానని, మరికొన్ని పనులను చూడలేదని, వాటన్నిటిని చూసిన తర్వాత సమాధానం తెలియజేస్తామని ఆయన అన్నారు

"చిలంకూరులో కోటి 20 లక్షల రూపాయల పనులు చేశారని ఎంబుక్​లో రికార్డ్ అయి ఉన్నాయి. కానీ ఒక్క పని కూడా చేయలేదు. కోటి 20 లక్షల గాను 20 లక్షల పనులు కూడా చేయలేదు. పంచాయతీ ఆఫీస్​లో బీనామీని పెట్టి ఇద్దంతా నడిపిస్తున్నారు"- నవీన్, ఎంపీటీసీ

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details