ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో.. 'రైతు కోసం' అఖిలపక్షం - కడప జిల్లాలో రైతు సమస్యలపై తెదేపా ఆల్​ పార్టీ మీటింగ్​

రైతు కోసం పేరుతో.. తెదేపా నేతలు రైల్వే కోడూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చించారు.

tdp all party meeting over farmers problems
తెదేపా ఆధ్వర్యంలో 'రైతు కోసం' ఆల్​ పార్టీ మీటింగ్​

By

Published : Dec 26, 2020, 9:35 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. రైతు కోసం పేరుతో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు అధ్యక్షతన ఇతర పార్టీల నేతలు కలిసి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతుల ఆత్మహత్యలు, పంట నష్టం నమోదు, మద్దతు ధర, ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సబ్సిడీ, సున్నా వడ్డీ, పంటల బీమా, మోటార్లకు మీటర్ల బిగింపు, కౌలు రైతుల సమస్యలు, రైతు ఆత్మహత్యలు వంటి రైతు సమస్యలపై సమావేశంలో చర్చించారు. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details