'గండికోట నిర్వాసితులకు పరిహారం అందించాలి' - gandikota project
కడపలో అఖిలపక్ష పార్టీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కడపలో అఖిలపక్ష పార్టీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం
గండికోట నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. కడప సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పరిహారం ఇవ్వకుండా నిర్వాసితులను ఇతర ప్రాంతాలకు పంపించడం దారుణమని అన్నారు. భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి అక్కడున్న స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడం తగదని పేర్కొన్నారు.