Steel Factory: సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేస్తూ కడప ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించడం వల్ల ప్రత్యక్షంగా 25 వేల మందికి పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే పేద సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం తక్షణం తన నిర్ణయం ఉపసంహరించుకొని సెయిల్ ఆధ్వర్యంలో కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేశారు. త్వరలో కమిటీలను ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించేంతవరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
సెయిల్ ఆధ్వర్యంలోనే కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలి
Steel Factory: సెయిల్ ఆధ్వర్యంలోనే ఉక్కు కర్మాగారం నిర్మించాలని కడపకు చెందిన అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జిందాల్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే కేవలం పెద్ద పెద్ద వర్గాలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేద, మధ్యతరగతి వారికి ఉద్యోగాలు దొరకవని పేర్కొన్నారు.
ఉక్కు కర్మాగారం