RAJAMPET BANDH: రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి బంద్ మొదలైంది. అఖిలపక్ష నేతలు ఉదయం ఐదు గంటలకే రాజంపేట ఆర్టీసీ డిపోకి చేరుకొని బస్సులు బయటకు రాకుండా రాళ్లను అడ్డుపెట్టారు. కానీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని నిరసన కారులను అక్కడినుంచి పంపించివేశారు. బస్సులను రాజంపేట పట్టణంలో నుంచి కాకుండా బైపాస్ నుంచి పంపిస్తున్నారు. పట్టణంలో ఆటోలు, లారీలు ఇతర వాహనాలు తిరగకుండా జేఏసీ నాయకులు అడ్డుకుంటున్నారు. కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయగా మరికొందరు తెరిచారు. ఈ దుకాణాలను కూడా నిరసనకారులు మూయించి వేశారు. కూరగాయల మార్కెట్ సైతం మూతపడింది. రాజంపేటలో ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతించలేదు. అయితే ప్రజల వద్ద తలెత్తుకోలేకపోతున్నామని వైకాపా నేతలు తెలిపారు.
RAJAMPET BANDH: రాజంపేటలో సకలజనుల బంద్ - Rajampet bandh latest news
RAJAMPET BANDH: రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు బంద్ చేపట్టారు. దీంతో తెల్లవారుజాము నుంచే డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా రాళ్లను అడ్డుపెట్టారు.
రాజంపేటలో సకలజనుల బంద్
Last Updated : Feb 8, 2022, 9:49 AM IST