కడప పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఎక్కడ న్యాయం జరగడం లేదని.. ప్రతి కేసు పంచాయితీ చేస్తున్నారని దుయ్యబట్టారు. లాక్‌డౌన్‌కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గంగా ఉందని ఆరోపించారు. పోలీసులు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వివిధ రకాల కారణాలు చూపించి ఇబ్బందులకు గురి చేశారని గుర్తుచేశారు. వైకాపా నాయకులు చెబితేనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరు మారకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
'పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు'
కడపలో పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. కడప పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
కడపలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం