ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 8, 2021, 8:13 PM IST

ETV Bharat / state

తొలి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలో మంగళవారం జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 155 పంచాయతీలకు పోలింగ్ జరగనుందని చెప్పారు.

kadapa
జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్

కడప జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 14 మండలాల్లో తొలివిడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో 206 పంచాయతీలకు గానూ.. 51 ఏకగ్రీవం కాగా... మిగిలిన 155 చోట్ల మంగళవారం పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. 4 లక్షల 37 వేల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారన్న కలెక్టర్... ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బ్యాక్సులు, సిబ్బంది తరలినట్టు చెప్పారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు, ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటివరకు 110 ఫిర్యాదులు అందాయని, వాటిలో 85 పరిష్కరించామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోసం 2 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 14 మండలాల్లో 136 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్న ఎస్పీ.. ఎక్కడైనా ఓటర్లకు, అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details