కడప జిల్లా వేంపల్లిలో వైన్‌షాప్‌ల ముందు.. మందు బాబులు ఎగబడ్డారు. మందు అయిపోతుందన్న తొందరలొ ఒకరినొకరు తోసుకున్నారు. ఫలితంగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ వైపు గుంపులుగా ఉండకూడదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు వైన్ షాప్ వద్ద మందు బాబులు ఎగబడుతున్నారు. వైన్ షాప్ లకు కూడా సెలవులు ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.
వైన్ షాప్ ముందు బారులు తీరిన మందుబాబులు
కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మందు బాబులు మాత్రం ఇలా వైన్ షాపుల ఎదుట గుమిగూడుతున్నారు. కరోనా గిరోనా జాన్తా నై అంటున్నారు.
వైన్‌షాప్ ముందు బారులుతీరిన మందుబాబులు