ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ ఏఐవైఎఫ్ నాయకుల ధర్నా - కడపలో ఏఐవైఎఫ్ నాయకులు ధర్నా వార్తలు

ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ కడపలో ఏఐవైఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. సెయిల్ ఆధ్వర్యంలోనే కర్మాగారం నిర్మించాలని లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ధర్నా చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు

By

Published : Nov 1, 2019, 7:46 PM IST

ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ ఏఐవైఎఫ్ నాయకుల ధర్నా

సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని కోరుతూ కడపలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏఐవైఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలో భాగంగా కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ నినాదాలు చేశారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం నిర్మించడం వల్ల ఎంతో ఊరట లభిస్తుందని తెలిపారు. సెయిల్ ఆధ్వర్యంలోనే కర్మాగారం నిర్మించాలని... లేదంటే ఉద్యమాలు చేస్తామని నాయకులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details