ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి'

కడపలోని బాలయోగి గురుకుల పాఠశాల సిబ్బందికి పెండింగ్​లోని ఉన్న 10 నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్ వద్ద బాలయోగి గురుకుల పాఠశాల సిబ్బంది ధర్నా
కలెక్టరేట్ వద్ద బాలయోగి గురుకుల పాఠశాల సిబ్బంది ధర్నా

By

Published : Mar 22, 2021, 4:56 PM IST

దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి దారుణమైన ముఖ్యమంత్రిని చూడలేదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కడపలోని బాలయోగి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్​లో ఉన్న పది నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సిబ్బంది వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు.

పేపర్ ప్లేట్స్​లో మట్టి వేసికొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గురుకుల పాఠశాల అధికారులు సిబ్బందిని విధుల నుంచి తొలగించిన కారణంగా రోడ్డున పడ్డారని ఆరోపించారు. కనీసం 18 వేల రూపాయలు జీతం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ తమ ఇబ్బందిని పట్టించుకోలేదని విమర్శించారు. సమస్య పరిష్కరించకుంటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details