స్వచ్ఛ భారత్ మిషన్లో పని చేస్తున్న సిబ్బందికి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. జీతాలు లేక గ్రీన్ అంబాసిడర్లు, వాచ్మెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తమ సమస్యలను తీర్చాలని కోరారు.
కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆందోళన - కడపలో ధర్నా
కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నాయకులు ఆందోళన చేశారు. పెండింగ్లో ఉన్న గ్రీన్ అంబాసిడర్లు, వాచ్మెన్లకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆందోళన AITUC concerns at Kadapa Collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8490124-960-8490124-1597917573784.jpg)
కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆందోళన