అగ్రిగోల్డ్ బాధితుల పత్రాల పరిశీలన అగ్రిగోల్డ్ బాధితుల్లో 10 వేల రూపాయల లోపు డిపాజిట్లుఉన్న వారికి పరిహారం చెల్లించటానికి కడప జిల్లా కోర్టు ఆవరణలో అధికారులుపత్రాల పరిశీలన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది బాధితులు ఉంటారని అధికారులు తేల్చారు. ఇందులో చాలామందిఅగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలను, గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకున్నారు.న్యాయస్థానం ముందువందల సంఖ్యలో బారులు తీరారు.పారా లీగల్ వాలంటీర్లు స్వచ్ఛందంగా బాధితుల దరఖాస్తులను పూర్తి చేయించారు. వాటిని జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ పరిశీలించారు. మార్చి 8 వరకు బాధితులు శిబిరాలకు వచ్చి ఆధారాలను చూపించాలని సూచించారు. వరుసలో ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లారు.అక్కడే ఉన్న వైద్యులు సేవలు అందించారు.