'కడప జిల్లాలో మిడతల దండు..ఆందోళనలో రైతన్నలు' అనే శీర్షికతో ఈటీవీ, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు కృష్ణమూర్తి, వ్యవసాయాధికారి లక్ష్మీప్రసన్న మైదుకూరు మండలం ఎల్లంపల్లె గ్రామంలోని పంటపొలాలను పరిశీలించారు.
రైతుల నుంచి వివరాలను సేకరించారు. జిల్లాలో మిడతల ప్రభావం లేదని చెప్పారు. రైతులు అనవసరంగా ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కీటక నాశనులు వాడితే ఈ మిడతలను నివారించవచ్చని తెలిపారు. వీటితో పొలాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని రైతులకు భరోసా ఇచ్చారు.