ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందూ వరద ప్రాంతాల్లో కమిషనరేట్ అధికారుల పర్యటన

వరదల వల్ల గతేడాది జరిగిన పంట నష్టం సమాచార సేకరణకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పలు గ్రామాల్లో పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి ఆ శాఖ గుంటూరు కమిషనరేట్ ఉపసంచాలకులు భగవత్ స్వరూప్​.. పొలాలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

agriculture officers visit
కుందూ వరదలపై వ్యవసాయాధికారుల పర్యటన

By

Published : Oct 21, 2020, 9:25 AM IST

గతేడాది కుందూ నది వరదల వల్ల నష్టపోయిన పంటలు, కోతకు గురైన పొలాలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. గుంటూరు కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు.. కడప జిల్లా పెద్దముడియం మండలంలో పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

కుందూ నది వరద కారణంగా.. గతేడాది వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పెద్ద మొత్తంలో భూమి కోతకు గురైంది. 375 హెక్టార్లలో కోటి 30 లక్షల నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ విషయంపై సమాచారం సేకరించడానికి గుంటూరు కమిషనరేట్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు భగవత్ స్వరూప్​ మండలానికి విచ్చేశారు. పాలూరు, చిన్న ముడియంలలో రైతులతో మాట్లాడి.. వివరాలను తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details